ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఇదిగో!

Photo of delhi beggar looking like a model
ఢిల్లీలోని బాగా బిజీగా ఉండే కూడలి.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలో ఒకతను వాహనాల మధ్యలోంచి వెళుతున్నాడు. నలుపు రంగు టీషర్ట్, కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని.. మంచి హెయిర్ స్టైల్ తో కనిపించాడు. చూడగానే ఎవరో మోడలో, సినిమా స్టారో అన్నట్టుగా కనిపించాడు. కానీ కిందికి చూస్తే.. కాలు దెబ్బతిని, చేతి కర్రలతో నడుస్తున్నాడు. నిజానికి అతనొక భిక్షగాడు. ఇది గమనించగానే జాలి వేసినా.. అతడి రూపం, స్టైల్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజంగా భిక్షగాడే..
  ట్విట్టర్ లో కవాల్ జిత్ సింగ్ బేడీ అనే నెటిజన్ ఈ ఫొటోను ‘ఢిల్లీ బెగ్గర్స్’ క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫొటో వైరల్ గా మారింది. 20 వేలకుపైగా లైక్ లు, వేల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. అతను భిక్షగాడు కాకపోవచ్చని, ఎవరో మోడల్ అయి ఉండవచ్చని కొందరు.. ఢిల్లీలో ఆ ప్లేస్ తమకు తెలుసని, భిక్షగాడే అయి ఉంటాడని మరికొందరు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇవన్నీ చూసిన సదరు నెటిజన్.. తన కారులో ఉన్న డ్యాష్ క్యామ్ (సీసీ కెమెరా వంటిది) ఫుటేజీలోని వీడియోను షేర్ చేశారు. అతను నిజంగానే భిక్షగాడు అని.. అతడి ఒక కాలు విరిగి, కర్రలతో నడుస్తున్నాడని తెలిపారు.

అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ..
  • ఇక బాలీవుడ్ నటుడు ఆదిత్యరాయ్ కపూర్ లా ఉన్నాడని, హృతిక్ రోషన్ తమ్ముడిలా ఉన్నాడని కొందరు అంటుంటే.. పుష్ప హీరో అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. 
  • అతనెవరోగానీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఫొటోలు పెట్టి ఉంటే బాగా ఫాలోయింగ్ వచ్చి ఉండేది అని చెప్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
Go Back to Shorts
New Delhi
Delhi Begger
Twitter
Offbeat
India
Bollywood
Tollywood
Model

More Telugu News