Aamir Khan: ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి: ఆమిర్ ఖాన్

If I hurted any one I regret says Aamir Kharn
షార్ట్స్‌లో చూడండి
దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమిర్ ఖాన్ ను వెంటాడుతున్నాయి. ఆయన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఆమిర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. తన సినిమాలను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు కోరారు. అయినప్పటికీ ట్రోలింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఆమిర్ మరోసారి మీడియా ముఖంగా స్పందించారు. 

తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి క్షమించాలని ఆమిర్ కోరారు. తాను ఎవరినీ నొప్పించాలని అనుకోలేదని చెప్పారు. తన సినిమాను ఎవరైనా చూడొద్దని అనుకుంటే... వారి సెంటిమెంట్ ను కూడా తాను గౌరవిస్తానని అన్నారు. మరోవైపు ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కరీనా కపూర్, మోనా సింగ్, అక్కినేని నాగచైతన్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Go Back to Shorts
Aamir Khan
Bollywood
Laal Singh Chaddha
Troll

More Telugu News