Nikhil: దూసుకుపోతున్న 'కార్తికేయ 2' ట్రైలర్!

  • నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2'
  • గతంలో వచ్చిన 'కార్తికేయ'కి ఇది సీక్వెల్ 
  • ఇటీవల వదిలిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్
  • ఈ నెల 13వ తేదీన సినిమా రిలీజ్
Karthikeya 2 movie update

నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. 'నా వరకూ వచ్చేవరకే సమస్య .. నా వరకూ వచ్చాక సమాధానం' అంటూ నిఖిల్ సందడి చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 

హీరో దైవ సంబంధమైన కార్యమేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమైంది. అంతకు మించి మిగతా విషయాలేవీ రివీల్ చేయలేదు. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. 

ఇంతవరకూ ఈ ట్రైలర్ 9 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకుంది. చాలా వేగంగా ఈ ట్రైలర్ ఈ స్థాయి వ్యూస్ ను అందుకోవడం విశేషంగా చెబుతున్నారు. నిఖిల్ జోడీగా అనుపమ అలరించనుంది. అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు..

More Telugu News