Chandrababu: ఢిల్లీలో ఉల్లాసంగా, ఉత్సాహంగా చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu held meeting with TDP MPs in Delhi
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఎంపీలతో ఛలోక్తులు విసురుతూ, నవ్వుతూ సరదాగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.
.
Go Back to Shorts
Chandrababu
TDP MPs
Galla Jayadev
New Delhi
Andhra Pradesh

More Telugu News