Gadikota Srikanth Reddy: టీడీపీ వాళ్లేమైనా గాంధీ మహాత్ములా?: ఎంపీ మాధవ్ అంశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందన

Gadikota Srikanth Reddy opines on MP Madhav issue
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై స్పందించారు. మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఇదే అదనుగా టీడీపీ నేతలు వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ అంశంపై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మాధవ్ తప్పు చేశాడని తేలితే అతడిపై పార్టీపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. అయినా టీడీపీ వాళ్లు గాంధీ మహాత్ముల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. నాడు టీడీపీ ప్రజాప్రతినిధులే విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారని, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటి కేటుగాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Gadikota Srikanth Reddy
MP Gorantla Madhav
Video Call
Chandrababu
TDP
Call Money
Vijayawada

More Telugu News