క్యాసినో బిజినెస్ చేస్తున్నా... అందులో త‌ప్పేముంది?: చీకోటి ప్ర‌వీణ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాసినో బిజినెస్ చేస్తున్నా... అందులో త‌ప్పేముంది?: చీకోటి ప్ర‌వీణ్‌

chikoti praveen comments on casino
  • శుక్ర‌వారం నాలుగో రోజు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన చీకోటి ప్ర‌వీణ్‌
  • రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల‌తో ప‌రిచయాలున్నాయ‌ని వెల్ల‌డి
  • ఈడీ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం ఇస్తున్నానని వివ‌ర‌ణ‌
  • ఈడీ విచార‌ణ ముగిశాక మీడియా స‌మావేశం పెడ‌తాన‌న్న చీకోటి
క్యాసినో ఆడించేందుకు ప్ర‌ముఖుల‌ను విదేశాల‌కు త‌ర‌లిస్తూ అక్ర‌మ లావాదేవీలు సాగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు విచారిస్తున్న చీకోటి ప్ర‌వీణ్ శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం వ‌రుస‌గా నాలుగో రోజు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క్యాసినో బిజినెస్ చేస్తాన‌ని చెప్పిన ప్ర‌వీణ్‌... అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. 

ఈ సంద‌ర్భంగా త‌న‌కు రాజ‌కీయ‌, సినీ రంగాల‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని కూడా ప్ర‌వీణ్ తెలిపారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తున్నాన‌ని తెలిపారు. ఈడీ విచార‌ణ ముగిసిన త‌ర్వాత మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని ప్రవీణ్ తెలిపారు.
Casino
Andhra Pradesh
Telangana
Chikoti Praveen
Enforcement Directorate

More Telugu News