దేశంలో మరో రోజూ 20 వేల కరోనా కేసులు

India reports 20408 fresh covid cases
  • గత  24 గంటల్లో 20,408 పాజిటివ్ కేసుల నమోదు
  • వైరస్ తో తాజాగా 54 మంది మృతి
  • వైరస్ నుంచి కోలుకున్న 20,958
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరో రోజు కూడా 20 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,408 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో 20,958 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, వైరస్ వల్ల మరో 54 మంది మృతి చెందారు. మొన్నటితో పోలిస్తే మరణాలు పెరిగాయి. మొన్న 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,43,384 క్రియశీల కేసులు ఉన్నాయి.

రోజువారి పాజిటివిటీ రేటు 5.05 శాతంగా నమోదైంది. క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. కరోనా నుంచి దేశంలో ఇప్పటిదాకా 4,33,30,442 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల 5,26,312 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. 

మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు 2,03,94,33,408 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 33,87,173 మందికి వ్యాక్సిన్ అందజేశారు.
Go Back to Shorts
COVID19
carona
daily cases

More Telugu News