Team India: వెస్టిండీస్‌తో మూడో వ‌న్డే... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

team inida wins toss and elect to bat first
షార్ట్స్‌లో చూడండి
వెస్టిండీస్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆతిథ్య జ‌ట్టుతో మ‌రికాసేప‌ట్లో మూడో వ‌న్డే ఆడ‌నుంది. ట్రినిడాడ్ వేదిక‌గా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి రెండు వ‌న్డేల్లో విజ‌యం సాధించిన టీమిండియా ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంది. తాజా మ్యాచ్‌లో విజ‌యం ద్వారా ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా య‌త్నిస్తుండ‌గా... క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా విజ‌యం ద‌క్కించుకుని ప‌రువు కాపాడుకునే దిశ‌గా ఆతిథ్య జ‌ట్టు య‌త్నిస్తోంది.
Go Back to Shorts
Team India
West Indies
Trinidad

More Telugu News