అదుపులోకి వస్తున్న కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!

India reports 14830 fresh cases
  • గత 24 గంటల్లో 14,830 పాజిటివ్ కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 36 మంది మృతి 
  • 1,47,512కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదిస్తోంది. గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 4.26 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 14,830 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 18,159 మంది కరోనా నుంచి కోలుకోగా... 36 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసులు 1,47,512కి తగ్గాయి. 

ఇక, ఇప్పటి వరకు 4,32,46,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,110 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.48 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,50,57,717 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయగా... నిన్న ఒక్క రోజే 30,42,476 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.  
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News