Syed Hafiz: ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితా.. తెలంగాణ కుర్రాడికి స్థానం

Syed Hafiz Who Hails From Karimnagar got place in Forbes List
షార్ట్స్‌లో చూడండి
ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితాలో తెలంగాణ కుర్రాడికి స్థానం లభించింది.  ఫోర్బ్స్ ఇండియా-గ్రూప్ ఎం-ఐఎన్‌సీఏ సంయుక్తంగా భారత టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాను విడుదల చేశాయి. ఇందులో గోదావరిఖనికి చెందిన హఫీజ్‌కు 32వ స్థానం లభించింది. డిజిటల్ స్టార్స్ ఎంపిక కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హాస్యం, అందం, ఫ్యాషన్, వ్యాపారం-ఆర్థికం, ఫిట్‌నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సామాజిక సేవ కేటగిరీల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వారిని ఎంపిక చేశారు. 

ఈ జాబితాలో గోదావరిఖని కాలనీలోని యైటింక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్‌కు 32వ స్థానం లభించింది. ఇదే కాలనీలో హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 2011లో తెలుగు ‘టెక్‌ట్యూట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ చానల్ ద్వారా కంప్యూటర్ కోర్సులు, మొబైల్ టెక్నాలజీ, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, జీమెయిల్ వాడకంలో ట్రిక్స్ చెబుతూ, సందేహాలు నివృత్తి చేస్తున్నారు. అలాగే, అప్‌డేటెడ్ వెర్షన్లు, మార్కెట్లోకి వచ్చే మొబైల్ ఫోన్ల వివరాల సమాచారాన్ని అందిస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన యూట్యూబ్ చానల్ ‘తెలుగు టెక్‌ట్యూట్స్’కు 15.70 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆయన వీడియోలను ఇప్పటి వరకు 17.2 కోట్ల మంది వీక్షించారు. అలాగే, ఆయన వీడియోలకు 99.4 శాతం కచ్చితత్వం, వాస్తవికత ఉండడంతో ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు స్థానం లభించింది. 

‘ముంబైకార్’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న ముంబైకి చెందిన నిఖిల్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నారు. వేర్వేరు కేటగిరీల్లో నటాషా నోయెల్, ఆశిష్ చంచ్లానీలు టాప్‌లో నిలిచారు. అలాగే, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు టాప్-100లో చోటు లభించడం గమనార్హం.
Go Back to Shorts
Syed Hafiz
Telugu Techtuts
Youtube Channel
Forbes India

More Telugu News