కోటి రూపాయల జాగ్వార్ కారు కొనుగోలు చేసిన టీమిండియా పేసర్
- మహ్మద్ షమీ ఇంటికి కొత్త కారు
- కూపే మోడల్ స్పోర్ట్స్ కారుపై మోజుపడిన షమీ
- ధర రూ.98.13 లక్షలు (ఎక్స్ షోరూమ్)
- ఇటీవలే డెలివరీ ఇచ్చిన జాగ్వార్ ప్రతినిధులు
జాగ్వార్ ఎఫ్ టైప్ మోడల్ లో ఇది 2.0 ఆర్-డైనమిక్ వేరియంట్. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్ డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 8 స్పీడ్ జడ్ఎఫ్ ట్రాన్స్మిషన్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ (ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. షమీ ఇటీవలే రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ ను కూడా కొనుగోలు చేశాడు.