Brian Lara: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దిగ్గ‌జం లారా.. వీడియో ఇదిగో

brian lara in team india dressing room
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా జ‌ట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టగానే క్రికెట్ దిగ్గ‌జం, విండీస్ జ‌ట్టు మాజీ సభ్యుడు, స్టార్ బ్యాట‌ర్ బ్రియ‌న్ లారాకు త‌న పాత జ్ఞాప‌కాల‌న్నీ గుర్తుకు వ‌చ్చిన‌ట్టున్నాయి. శుక్ర‌వారం భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య లారా జ‌న్మ‌స్థానం ట్రినిడాడ్‌లో తొలి వ‌న్డే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వ‌చ్చిన లారా... టీమిండియా హెడ్ కోచ్, త‌న స‌హ‌చ‌ర క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చిన సంగ‌తి తెలిసిందే.

స్టేడియం స్టాండ్స్‌లో ద్రావిడ్‌తో ఫొటో సెష‌న్‌తో స‌రిపెట్ట‌ని లారా... నేరుగా టీమిండియా జ‌ట్టు స‌భ్యులున్న డ్రెస్సింగ్ రూంకు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా టీమిండియా వ‌న్డే జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావ‌న్.. లారా వ‌ద్ద‌కెళ్లి అత‌డితో చేతులు క‌లిపాడు. అప్ప‌టికే లారాను చుట్టుముట్టిన భార‌త క్రికెట్ జట్టు స‌భ్యులు అత‌డితో పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. టీమిండియా స‌భ్యుల‌తో న‌వ్వుతూ తుళ్లుతూ క‌నిపించిన లారా... ఆ త‌ర్వాత చిన్నగా అక్క‌డి నుంచి క‌దిలాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో పంచుకుంది.
Go Back to Shorts
Brian Lara
Team India
West Indies
Trinidad
Rahul Dravid
Sikhar Dhavan

More Telugu News