బాలయ్య సినిమాకి అదే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట!
- షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా
- రేపటి నుంచి కర్నూల్ షెడ్యూల్
- భారీస్థాయిలో జరగనున్న యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- డిసెంబర్ 2వ తేదీనే రిలీజ్ చేసే ఛాన్స్
కర్నూల్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. బాలకృష్ణ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను 'అఖండ' మాదిరిగానే డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది.
ఆ తరువాత డిసెంబర్ చివరిలో విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. కానీ మేకర్స్ డిసెంబర్ 2వ తేదీనే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. కథానాయికగా శ్రుతి హాసన్ .. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.