ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... 21న ఓట్ల లెక్కింపు
- ఈ నెల 21న వెల్లడి కానున్న ఫలితం
- ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి పదవీ ప్రమాణం
- బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా
ఇక ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21న వెల్లడి కానున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించిన తర్వాత ఈ నెల 21న ఓట్ల లెక్కింపును చేపట్టనున్న అధికారులు... అదే రోజు ఫలితాన్ని ప్రకటించనున్నారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నిక కానున్న అభ్యర్థి ఈ నెల 25న భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేస్తారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.