రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని, యూపీ, తమిళనాడు సీఎంలు
- పార్లమెంటు భవన్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రధాని
- దేశ వ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ కేంద్రాలు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్
ప్రధాని వచ్చిన సమయంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ఓటు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ లోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుంది.