పార్ల‌మెంటులో అఖిల‌ప‌క్ష భేటీ... ప్ర‌ధాని గైర్హాజ‌రును ప్ర‌శ్నించిన కాంగ్రెస్ పార్టీ

congress satires on pm modi skips all party meeting
  • పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో అఖిల‌ప‌క్ష భేటీ
  • వైసీపీ నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజ‌రు
  • టీడీపీ నుంచి క‌న‌క‌మేడ‌ల‌, గ‌ల్లా హాజరు
  • టీఆర్ఎస్ త‌ర‌ఫున హాజ‌రైన కేకే, నామా
పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో ఆదివారం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో అధికార కూట‌మి ఎన్డీఏ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గైర్హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు జైరాం ర‌మేశ్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఇదివ‌ర‌క‌టి మాదిరిగానే మోదీ డుమ్మా కొట్టార‌న్న ర‌మేశ్‌... ఇది అన్‌పార్ల‌మెంట‌రీనేన‌ని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే... ఈ స‌మావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఆ విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజ‌రు కాగా... విప‌క్ష టీడీపీ నుంచి క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌, గ‌ల్లా జ‌య‌దేవ్‌లు హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కె.కేశ‌వ‌రావు, నామా నాగేశ్వ‌ర‌రావులు హాజ‌ర‌య్యారు.
Parliament
BJP
Congress
Jairam Ramesh
YSRCP
TDP
TRS

More Telugu News