Vijay Antony: అసలు హంతకులు ఎవరు? : ఆసక్తిని రేకెత్తిస్తున్న 'హత్య' మోషన్ పోస్టర్!

  • విజయ్ ఆంటోని నుంచి మరో చిత్రం 
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా మీనాక్షి చౌదరి 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
Hathya movie motion poster released

'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో విజయ్ ఆంటోనీ పాప్యులర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. 'బిచ్చగాడు' తరువాత ఆయన చాలా ప్రయోగాలు చేశాడు. ఆ సినిమాను దాటి మిగతా సినిమాలు ఆడలేదు. ఆయనకి ఆ స్థాయి పేరును తీసుకుని రాలేదు. 

అయినా ఆయన నిరాశ పడకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా తమిళంలో 'కొలై' రూపొందింది. లోటస్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాకి 'హత్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఒక హత్య కేసును ఛేదించే డిటెక్టివ్ గా విజయ్ ఆంటోని ఈ సినిమాలో కనిపించనున్నాడనే విషయం ఈ మోషన్ పోస్టర్ ద్వారా అర్థమైపోతోంది. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచారని చెప్పచ్చు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

More Telugu News