బాలీవుడ్ లోకి వచ్చి 30 ఏళ్లు అయిందనే విషయం గుర్తుకు రాలేదు: కాజోల్

Kajol completes 30 years in Bollywood
  • నిన్ననే బాలీవుడ్ లోకి వచ్చినట్టుందన్న కాజోల్
  • ఓటీటీలో పలు రకాల కొత్త పాత్రలు చేయొచ్చని వ్యాఖ్య 
  • ఓటీటీల్లో స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంటుందన్న కాజోల్ 
కథానాయిక కాజోల్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లు గడిచిపోయినా ఆమె ఇప్పటికీ అంతే హుషారుగా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో బిజీగానే ఉన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, బాలీవుడ్ లోకి వచ్చి 30 ఏళ్లు అయిందని తనకు గుర్తుకు రాలేదని చెప్పారు. నిన్ననే కెరీర్ ను ప్రారంభించినట్టుగా ఉందని తెలిపారు. 

'ఆర్య' వెబ్ సిరీస్ అవకాశం తొలుత తనకే వచ్చిందని, అయితే ఆ సమయంలో ఆ స్క్రిప్ట్ ను తాను చేయలేకపోయానని చెప్పారు. పలు కారణాలతో తాను అందులో నటించలేకపోయానని అన్నారు. త్వరలోనే కాజోల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ... థియేటర్లలో సినిమాలకు పరిమితులు ఉంటాయని.. ఓటీటీలో అయితే కొంత స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఓటీటీలో పలు రకాల కొత్త పాత్రలను పోషించవచ్చని చెప్పారు. తన పిల్లల విషయానికి వస్తే కాలంతో పాటు వారు ఎంతో పెరిగారని చెప్పారు. 

Go Back to Shorts
Kajol
Bollywood
30 Years

More Telugu News