ద్రౌపది ముర్ముకు ఘనంగా స్వాగతం పలికిన చంద్రబాబు
- ఏపీ టూర్‌కు వచ్చిన ద్రౌపది ముర్ము
- వైసీపీ నేతలతో భేటీ తర్వాత గేట్‌వేకు వచ్చిన ముర్ము
- పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన చంద్రబాబు
- అచ్చెన్నాయుడును పరిచయం చేసిన టీడీపీ అధినేత
అనంతరం విజయవాడలోని గేట్ వే హోటల్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ముర్ముకు పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చిన చంద్రబాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆమెకు పరిచయం చేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలకు ముర్మును పరిచయం చేసిన చంద్రబాబు... రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకే ఓటేయాలని పిలుపునిచ్చారు.