‘మహా’ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. రేపే ముహూర్తం!
- మహారాష్ట్ర సంక్షోభానికి రేపటితో తెర
- ఉప ముఖ్యమంత్రిగా షిండే?
- మధ్యాహ్నం శివసేన రెబల్స్‌తో బీజేపీ కీలక సమావేశం
- హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సీఎం హోదాలో ఫడ్నవీస్
మరోవైపు, మరికాసేపట్లో గోవాలోని తాజ్‌లో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడతారు. అలాగే, మహారాష్ట్రలోని బీజేపీ కోర్ గ్రూప్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సంకీర్ణ శివసేన రెబల్స్‌తో కీలక చర్చలు జరపనుంది. పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా షిండే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అలాగే, జులై 2న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.