RRR: ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'

  • 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'
  • పోటీలో ఉన్న మరో 9 హాలీవుడ్ చిత్రాలు
  • ఇండియా నుంచి పోటీ పడుతున్న తొలి చిత్రం
RRR nominated for  Hollywood Critics Association Awards

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం రూ. 1,150 కోట్లను వసూలు చేసింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. 

మరోవైపు ప్రతిష్ఠాత్మక అవార్డ్ కు ఈ చిత్రం నామినేషన్ పొందింది. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఉత్తమ సినిమా కేటగిరీలో నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ అవార్డ్స్ కు ఇంత వరకు ఏ భారతీయ చిత్రం కూడా పోటీ పడక పోవడం గమనార్హం. ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'తో పాటు మరో 9 హాలీవుడ్ చిత్రాలు పోటీపడుతున్నాయి.

More Telugu News