తెలంగాణ వర్సిటీల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు
- ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే పలు నోటిఫికేషన్ల జారీ
- వర్సిటీల్లోని ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు
- ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధ్యక్షతన బోర్డు
- బోర్డు కన్వీనర్‌గా కళాశాల విద్యా శాఖ కమిషనర్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లోని ఖాళీల భర్తీని ఎలా చేపట్టాలన్న విషయంపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ బోర్డుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విద్యా శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. వర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ఈ బోర్డే నోటిఫికేషన్లు జారీ చేయనుంది.