ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా దిగిపోతా... రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
- హిందూత్వను ఎన్నడూ వదిలిపెట్టలేదన్న ఉద్ధవ్
- అది తమ సిద్ధాంతమని వివరణ
- సీఎం పదవి కోసం పోరాటం చేయబోనని స్పష్టీకరణ
- శరద్ పవార్ అభీష్టం మేరకే సీఎం పదవి చేపట్టానని వెల్లడి
హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు. సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా... మరుక్షణమే తాను పదవికి రాజీనామా చేస్తానని థాకరే కీలక ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా లేఖను తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని కూడా ఆయన ప్రకటించారు.