Sachin Pilot: బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందుకే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు: సచిన్ పైలట్

Sachin Pilot alleges BJP targtes their opponents for questioning them
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా నిత్యం ఈడీ ఆఫీసులో విచారణను ఎదుర్కొంటుండడంపై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ స్పందించారు. ఈడీ విచారణ కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్య అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందుకే కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ లను మాత్రమేకాదు... యావత్ కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వివరించారు. 

ప్రతీకార చర్యల కోసం ఇన్ కమ్ టాక్స్, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని సచిన్ పైలెట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి ఈ సంస్థలు చేతి పనిముట్లు వంటివన్న విషయం అందరికీ తెలుసని అన్నారు.
Go Back to Shorts
Sachin Pilot
Congress
BJP
Sonia Gandhi
Rahul Gandhi
ED

More Telugu News