'సలార్' వచ్చేది అప్పుడేనట!
- షూటింగు దశలో 'సలార్'
- 30 శాతమే జరిగిన చిత్రీకరణ
- కథానాయికగా శ్రుతి హాసన్
- 2023 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఈ ఏడాదిలో రావడం లేదనేది తాజా సమాచారం. ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. మిగతా చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
అందువలన వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఆల్రెడీ 'ఆది పురుష్'ను పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం 'ప్రాజెక్టు K' పనులతో బిజీగా ఉన్నాడు.