బాలయ్య పుట్టినరోజున ఆయన 107వ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్!
- షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా
- కథానాయిక పాత్రలో శ్రుతి హాసన్
- ఈ నెల 10వ తేదీన ఫస్టు గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్
- దసరాకి సినిమాను విడుదల చేసే అవకాశం
ఇంతకుముందు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన సినిమాలు దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన బాలయ్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి తరువాత బాలయ్యను ఆ రేంజ్ లో గోపీచంద్ మలినేని చూపించనున్నాడని అనుకుంటున్నారు.
రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. బాలయ్య సరసన కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. బాలయ్యతో తలపడే ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.