విజయనగరం జిల్లాలో నేడు దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయనున్న చినజీయర్ స్వామి
- చినజీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలో చదువుకున్న గణేశ్
- వందమంది చిన్నారులకు భగవద్గీత నేర్పిన గణేశ్
- ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం
- నేటి సాయంత్రం 5 గంటలకు భూమి పూజ చేయనున్న చినజీయర్ స్వామి
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం చినజీయర్ స్వామి గంట్యాడలో గీతా పారాయణం నిర్వహించారు. కాగా, గణేశ్‌కు ఇటీవల ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ఆయన చినజీయర్ స్వామికి చెప్పడంతో శంకుస్థాపన చేసేందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నేటి సాయంత్రం 5 గంటలకు స్వామి తన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు గణేశ్ తెలిపాడు.