పిఠాపురంలో నేడు టీడీపీ ఎస్సీ గర్జన... అనుమతి లేదంటున్న పోలీసులు

TDP set to conduct SC Garjana in Pithapuram
  • ఎస్వీఎస్ఎన్ వర్మ నేతృత్వంలో ఎస్సీ గర్జన
  • టీడీపీ కార్యాలయానికి చేరుకున్న వర్మ  
  • కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు 
కాకినాడ జిల్లా పిఠాపురంలో నేడు టీడీపీ ఎస్సీ గర్జన నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పోలీసులు కాకినాడలో గృహనిర్బంధం చేశారు. అయితే, గత రాత్రి వర్మ పోలీసుల కళ్లుగప్పి, తన నివాసం నుంచి పిఠాపురంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. 

ఎస్సీ గర్జనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్సీ గర్జన నిర్వహించి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పిఠాపురంలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వర్మకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Go Back to Shorts
SC Garjana
Pithapuram
TDP
SVSN Varma
Police
Kakinada District

More Telugu News