Haryana: 12 రోజుల క్రితం అదృశ్యమై విగతజీవిగా కనిపించిన హర్యాన్వీ గాయని

Missing for 12 days Haryanvi singer found dead in Rohtak
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 11న అదృశ్యమైన ఢిల్లీకి చెందిన హర్యాన్వీ గాయని ఘటన విషాదాంతమైంది. రెండువారాల తర్వాత తాజాగా హర్యానాలోని రోహ్‌తక్‌ జిల్లాలో ఓ వంతెన కింద పాతిపెట్టిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, హత్యకేసు నమోదు చేశారు. 

ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ నిమిత్తం ఈ నెల మొదట్లో యువ గాయనిని ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ నుంచి రోహ్‌తక్ తీసుకెళ్లారు. కుమార్తె వెళ్లి చాలా రోజులు అయినా ఆమె నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం ఆమె ఫోన్ స్విచ్చాన్ కావడంతో వెంటనే ట్రేస్ చేశారు. ఆ ఫోన్‌ను ఆన్ చేసిన వ్యక్తిని రవిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, భైరోన్ భైనీ గ్రామ సమీపంలోని ఫ్లైవర్ ఓవర్ దగ్గర ఓ మృతదేహాన్ని పాతిపెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. అది తమ కుమార్తెదేనని ఆ తర్వాత గాయని కుటుంబ సభ్యులు గుర్తించారు. విచారణ సందర్భంగా ఆమెను తానే హత్య చేసినట్టు నిందితుడు రవి అంగీకరించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Haryana
New Delhi
Haryanvi Singer
Crime News

More Telugu News