నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ
- మే 28న ఎన్టీఆర్ జయంతి
- ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు
- ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బాలకృష్ణ
- శతజయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న అభిమానులు
మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన స్వస్థలం నిమ్మకూరులో శతజయంతి వేడుకల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకలను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు, తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలయ్య హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ వేడుకల కోసం అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.