Mission Bhagiratha: మిష‌న్ భ‌గీర‌థ‌పై ద‌ర్యాప్తున‌కు కేంద్రం ఆదేశం

union govenrment orders enquiry in to mission bhagiratha
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో ఇంటింటికీ తాగు నీటి సరఫరా కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన మిష‌న్ భ‌గీర‌థ‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ ద‌ర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకాధికారిని నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది

  మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్య‌యం చేసింది. అయితే జ‌ల జీవ‌న్ క‌మిష‌న్ ఇటీవ‌లే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ క‌మిష‌న్ స‌ర్వే రిపోర్టు ఇటీవ‌లే కేంద్రానికి అంద‌గా... ఆ నివేదిక ఆధారంగా ప‌థ‌కంపై కేంద్ర జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు ఓ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ప‌థ‌కంపై దర్యాప్తున‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Mission Bhagiratha
Telangana
Union Government

More Telugu News