Kajal Agarwal: నువ్వే నా తొలి సర్వస్వం.. అంటూ కొడుకు ఫొటోలు పోస్ట్ చేసిన కాజల్

  • ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ భరిత పోస్ట్
  • నా సూర్యుడు, చంద్రుడు, చుక్కలు నువ్వేనంటూ కామెంట్
  • గుణవంతుడివి అవ్వాలంటూ ఆకాంక్ష
Kajal Agarwal Shares Her Son Photos

మదర్స్ డే సందర్భంగా కాజల్ తొలిసారి తన కుమారుడి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. కుమారుడికి తన మెసేజ్ ను పోస్ట్ చేసింది. ‘‘నువ్వు నాకు ఎంత విలువైనవాడివో.. ఎంత ప్రత్యేకమో నీకు చెప్పాలనుకుంటున్నా’’ అంటూ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. 

‘‘నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం.. నీ చిట్టి చిట్టి చేతులను నా చేత్తో పట్టుకున్న ఆ క్షణం.. నీ వెచ్చని శ్వాస నాకు తగిలింది. అప్పుడే నీ అందమైన కళ్లను చూశా. నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు. 

నువ్వు నా మొదటి బిడ్డవు. నా మొదటి కొడుకువు. నా మొదటి సర్వస్వం నువ్వు. రాబోయే రోజుల్లో నీకు ఎన్నో విషయాలను నేర్పుతాను. కానీ, అంతకన్నా ముందు నువ్వే నాకు ఎన్నో విషయాలు నేర్పించావు. తల్లి అంటే ఏంటో చెప్పావు. నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్పావు. స్వచ్ఛమైన ప్రేమను అందించావు. శరీరంలోపలే కాకుండా బయట కూడా హృదయం ఉంటుందన్న విషయాన్ని నిరూపించావు. బయట గుండె ఉండడం భయపడే విషయమేమో కానీ.. అంతకన్నా అందమైన విషయం. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.
నా తొలి అయినందుకు కృతజ్ఞతలు. మరెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. అందుకు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు నా చిన్ని యువరాజా. నువ్వు మరింత దృఢంగా ఎదగాలి. ఎదుటి వారిపట్ల దయగా ఉండాలి. ప్రపంచానికి ఎప్పుడూ వెలుతురునివ్వాలి. ధైర్యవంతుడవు కావాలి. దయామయుడిలా, దాతలా, సహనశీలిలా ఉండాలి. గుణవంతుడివి అవ్వాలి.  నేను ఇప్పటికే ఈ గుణాలన్నింటినీ నీలో చూస్తున్నాను. నువ్వు నా కొడుకువి అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నా.

నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా నక్షత్రాలు.. ఎప్పుడూ ఈ విషయాలు మరచిపోకు’’ అంటూ ఆమె భావోద్వేగభరితంగా రాసుకొచ్చింది. కాగా, ఆమె పోస్టుకు ఆమె సోదరి నిషా అగర్వాల్, సమంత, హన్సిక, కరిష్మా మెహతా, నీరజా కోన, రాశీ ఖన్నా వంటి హీరోయిన్లు కామెంట్లు పెట్టారు. చాలా అందంగా ఉన్నావంటూ పోస్ట్ పెట్టారు. 


More Telugu News