ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
- మే 3న రంజాన్ పండుగ
- శుభాకాంక్షల ప్రకటన విడుదల చేసిన పవన్
- రంజాన్ ప్రాశస్త్యం వివరించిన జనసేనాని
- ప్రవక్త బోధనలు సర్వదా అనుసరణీయమని వెల్లడి
మానవాళికి సచ్ఛీలత, సన్మార్గం, క్షమ, దయాగుణాలను బోధించే దివ్య ఖురాన్ దివి నుంచి భువికి వచ్చిన పుణ్యకాలం రంజాన్ అని విశ్వసిస్తారని పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల సారం ఈ వేడుక అని తెలిపారు. మానవాళిలో దానగుణం ఉండాలని రంజాన్ తెలియచెబుతోందని పవన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ దానం చేయాలన్న ప్రవక్త బోధన ఎంతో విలువైనదని ఉద్ఘాటించారు.
ధనిక, పేద అనే తారతమ్యాలను మరచి మానవత్వంతో మెలగాలని... చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు మాట్లాడరాదు అనే హితవచనాలు సర్వదా అనుసరణీయమని వివరించారు.