ఓటీటీలో వచ్చేస్తున్న 'రాధే శ్యామ్' హిందీ వర్షన్... ఎప్పుడు, ఎందులో వస్తోందంటే..?
Add ap7am to your home Screen

ఓటీటీలో వచ్చేస్తున్న 'రాధే శ్యామ్' హిందీ వర్షన్... ఎప్పుడు, ఎందులో వస్తోందంటే..?

Hindi Radhe Shyam coming on Netflix OTT
  • ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో దక్షిణాది భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రాధే శ్యామ్'
  • హిందీ వర్షన్ ను స్ట్రీమింగ్ చేయనున్న నెట్ ఫ్లిక్స్
  • మే 4 నుంచి హిందీ వర్షన్ స్ట్రీమింగ్
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' ఓటీటీలో వచ్చేస్తోంది. ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం హిందీ వర్షన్ ను మే 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ మ్యూజిక్ ను అందించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రొమాంటిక్ లవ్ డ్రామా అభిమానులను నిరుత్సాహ పరిచింది. 

మరోవైపు ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వర్షన్ లు అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీ, టెలివిజన్ లో ఈ చిత్రం కొంత ఎక్కువ సక్సెస్ ను సాధించింది. ఇప్పుడు తాజాగా హిందీలో కూడా ఓటీటీలో వచ్చేస్తోంది.
Radhe Shyam
Hindi
OTT
Netflix
Bollywood
Tollywood

More Telugu News