107వ సినిమా కోసం నెగెటివ్ షేడ్స్ తో కనిపించనున్న బాలయ్య!

Gopichand Malineni movie update
  • 107వ సినిమా షూటింగులో ఉన్న బాలయ్య
  • ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది
  • బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు 
  • ఆయన చెల్లెలి పాత్రను పోషిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ 
బాలకృష్ణ తన కెరియర్లో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. 'సుల్తాన్' సినిమాలో మాత్రమే ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయి. తాను హీరోగా చేసిన సినిమాలోనే నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేయాలనుందని ఇటీవల బాలకృష్ణ అన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన అలానే కనిపించనున్నాడని అంటున్నారు. 

ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన ఒక పాత్రలో నెగెటివ్  షేడ్స్ తో కనిపిస్తారని చెబుతున్నారు. ఆ పాత్రకి చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఆమె నిశ్చితార్ధం తాలూకు సీన్స్ ను హైదరాబాద్ .. సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించినట్టు సమాచారం.

తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఇక ప్రతి నాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్నాడు.  ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni

More Telugu News