తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు!
Add ap7am to your home Screen

తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు!

Kajal Aggarwal after giving birth to baby boy
  • ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన కాజల్
  • గర్భవతి అయిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వైనం
  • తాజాగా మళ్లీ అభిమానుల ముందుకు వచ్చిన కాజల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కూడా ఆమె కుటుంబం వెల్లడించింది. దాదాపు 12 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న కాజల్ తన తొలి బిడ్డకు జన్మనివ్వడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. 

అయితే, సినిమాలకు దూరమైనప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ... అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోతో ఆమె మళ్లీ అభిమానుల ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
Kajal Aggarwal
Tollywood
Bollywood

More Telugu News