'సలార్'లో కళ్లు చెదిరిపోయే ఛేజింగ్ సీన్స్!
- షూటింగు దశలో 'సలార్'
- ఎమోషన్ చుట్టూ తిరిగే యాక్షన్
- హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్
- కథానాయికగా శ్రుతిహాసన్
ఇప్పుడు అందరి దృష్టి ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' పైనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. ఎమోషన్ ట్రాక్ నడుస్తుందని అంటున్నారు.
ఈ సినిమాలో భయంకరమైన ఒక లోయలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ సీన్ ను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ ఒక్క సీన్ కోసం 20 కోట్లవరకూ ఖర్చుచేసినట్టుగా సమాచారం. 'కేజీఎఫ్ 2' నిర్మాతనే ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.