Chandrababu: చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క బ‌ర్త్ డే గ్రీటింగ్స్‌

congress mla seethakka birth day greetings to chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి బ‌ర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో అంద‌రినీ ఆక‌ట్టుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత‌క్క నుంచి వ‌చ్చిన గ్రీటింగేన‌ని చెప్పాలి. ఎందుకంటే.. సీత‌క్క ఒక‌ప్పుడు టీడీపీలోనే ఉన్నా... తెలుగు నేల విభ‌జ‌న‌, మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగానూ కొన‌సాగుతున్నారు. 

రాజ‌కీయ ప‌రంగా చూస్తే.. కాంగ్రెస్ నేత‌ల నుంచి చంద్ర‌బాబుకు గ్రీటింగ్స్ రావ‌డం అరుదే. అయితే త‌న‌చేత రాజకీయ ఓన‌మాలు దిద్దించిన చంద్ర‌బాబు అంటే సీత‌క్కకు ఎన‌లేని అభిమానం. ఈ కార‌ణంగానే ఆమె ఏ పార్టీలో ఉన్నా... ఏ స్థితిలో ఉన్నా చంద్ర‌బాబుకు గ్రీటింగ్స్ చెప్ప‌కుండా ఉండ‌లేరు. రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేతికి రాఖీ క‌ట్ట‌కుండా ఉండ‌లేరు. అందుకే కాబోలు బుధ‌వారం చంద్ర‌బాబు బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకుని ఇటీవ‌లే చంద్ర‌బాబు చేతికి రాఖీ క‌డుతున్న ఫొటోను షేర్ చేసిన సీత‌క్క‌.. హ్యాపీ బ‌ర్త్ డే అన్నా... అంటూ చంద్ర‌బాబుకు బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
NCBN
TDP
Birth Day
Seethakka
Congress

More Telugu News