కన్నడ స్టార్ యశ్ పై కంగనా రనౌత్ ప్రశంసలు
- బాక్సాఫీసును కొల్లగొడుతున్న 'కేజీఎఫ్2'
- భారత్ మిస్ అయిన యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అన్న కంగన
- అమితాబ్ స్థానాన్ని భర్తీ చేశాడని కితాబు
మరోవైపు యశ్ పై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ మిస్ అయిన యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అని కితాబునిచ్చింది. డబ్బయిల నుంచి అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను యశ్ భర్తీ చేశాడని తెలిపింది. కంగన వ్యాఖ్యల పట్ల యశ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.