రెడీ అవుతున్న 'సలార్' టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెడీ అవుతున్న 'సలార్' టీజర్!

Salaar movie update
  • ఈ రోజే థియేటర్లకు వచ్చిన 'కేజీఎఫ్ 2'
  • వచ్చేనెలలో 'సలార్' టీజర్ రిలీజ్
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు 
  • వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ 2' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సినిమాలో యష్ ను ఆయన చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దాంతో అందరి దృష్టి ఇప్పుడు 'సలార్' పైకి వెళ్లింది. ప్రభాస్ ను ఎలా చూపించనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.  

'కేజీఎఫ్ 2' నిర్మాతలతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'కేజీఎఫ్ 2' సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన రవి బస్రూర్,  'సలార్'కి కూడా బాణీలను అందిస్తున్నాడు. ప్రభాస్ 'రాధేశ్యామ్' పనుల్లో ఉండటం వలన .. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' ప్రమోషన్స్ లో ఉండటం వలన 'సలార్' విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. 

ఇక ఇప్పుడు ఇద్దరూ ఫ్రీ కావడం వలన 'సలార్' పనులు ఊపందుకోనున్నాయని అంటున్నారు. వచ్చే నెలలో టీజర్ ను రిలీజ్ చేసి, మళ్లీ ఈ సినిమాను గురించి అంతా మాట్లాడుకునేలా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. జగపతి బాబు .. ఈశ్వరీ రావు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Prabhas
Sruthi Haasan
Prashanth Neel
Salaar Movie

More Telugu News