Sonu Sood: త‌న‌ భార్య ప్ర‌తి రోజు త‌న రక్తం తాగుతోందంటూ సోనూసూద్‌కు ఓ వ్య‌క్తి ఫ‌న్నీ ట్వీట్

  • దానికి ఏదైనా చికిత్స ఉందా? అని ప్ర‌శ్న
  • ఉంటే దయచేసి సాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఒక భార్యా బాధితుడిగా చేతులు జోడించి సాయం అడుగుతున్నానని వ్యాఖ్య‌
  • బ్లడ్ బ్యాంకును ప్రారంభించాల‌ని సోనూ రిప్లై
Sonu Sood give funny reply

సాయం చేయాలంటూ సినీ న‌టుడు సోనూసూద్ కు చాలా మంది ట్వీట్లు చేస్తుంటారు. త‌న‌కు ట్వీట్ చేసే వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ సోనూసూద్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌న‌కు కొంద‌రు స‌ర‌దాగా కూడా ట్వీట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అటువంటి వాటిపై సోనూసూద్ కూడా ఫ‌న్నీగా రిప్లై ఇస్తుంటారు. 

తాజాగా, తాను భార్యా బాధితుడినంటూ, సాయం చేయాలంటూ సోనూసూద్‌కు ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు. తనకు కూడా చికిత్స చేయించాలని కోరాడు. సోనూసూద్‌ అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారని, త‌న‌ భార్య ప్ర‌తి రోజు త‌న రక్తం తాగుతోందని అన్నారు. ఈ నేప‌థ్యంలో దానికి ఏదైనా చికిత్స ఉందా? అని ప్ర‌శ్నించాడు. 

ఉంటే దయచేసి సాయం చేయాల‌ని కోరాడు. తాను సోనూసూద్‌ను ఒక భార్యా బాధితుడిగా చేతులు జోడించి సాయం అడుగుతున్నానని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన‌ సోనూ సూద్‌.. అలా చేయ‌డం ప్రతి భార్య జన్మ హక్కు అని రిప్లై ఇచ్చారు. ఆ రక్తంతో త‌నలాగే బ్లడ్ బ్యాంకును ప్రారంభించాల‌ని చెబుతూ న‌వ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజ‌న్లు కూడా ఫ‌న్నీగా రిప్లై ఇస్తున్నారు.

More Telugu News