అలక వీడని సుచరిత.. అనారోగ్య కారణంతో సజ్జలను కలిసేందుకు నిరాకరణ!
- మంత్రి పదవి దక్కనందుకు అలక
- న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎంపీ మోపిదేవి
- రెండు రోజులుగా గుంటూరులో కార్యకర్తల ఆందోళన
అలాగే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు ఫోన్ చేసి, రమ్మని చెప్పారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆమె వెళ్లలేదని ఆమె సన్నిహితులు చెప్పారు. వీరిద్దరు మినహా అధిష్ఠానం నుంచి సుచరితతో ఎవరూ మాట్లాడలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు సుచరిత ఆదివారం ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సుచరితకు మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు రెండు రోజులుగా గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.