పవన్ తో 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత భేటీ.. పక్కనే హరీశ్ శంకర్!
- పవన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అభిషేక్ అగర్వాల్
- పవన్ ను కలవడం సంతోషంగా ఉందన్న అగర్వాల్
- వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? అనే కోణంలో ప్రారంభమైన చర్చ
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిశారు. అయితే ఈ కలయిక వెనుక కారణం ఏమిటన్నది మాత్రం వెలుగులోకి రాలేదు. పవన్ తో అభిషేక్ చిత్రాన్ని నిర్మిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ కూడా వీరితో ఉండటం గమనార్హం.
పవన్ తో సమావేశానంతరం అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పవన్ తో సుదీర్ఘమైన సంభాషణ జరగడం ఆనందంగా ఉందని చెప్పారు.