అనంతపురం జిల్లాలో విద్యుత్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు
- రోజుకు ఐదారుగంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆందోళన
- పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
- ఉన్నతాధికారుల హామీతో శాంతించిన రైతులు
సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు.