హైదరాబాద్ లో 'గని' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Ghani movie update
  • బాక్సర్ 'గని'గా వరుణ్ తేజ్ 
  • దర్శకుడిగా కిరణ్ కొర్రపాటికి ఫస్టు మూవీ
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఈ నెల 8వ తేదీన సినిమా విడుదల
వరుణ్ తేజ్ హీరోగా 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ కథానాయికగా అలరించనుంది. 

ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు. ఇక ఈ రోజున హైదరాబాద్  .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో, సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. 

నిర్మాతగా అల్లూ బాబీకి .. దర్శకుడిగా కిరణ్ కొర్రపాటికి .. కథానాయికగా సయీ మంజ్రేకర్ కి ఇది మొదటి సినిమా. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో జగపతిబాబు .. నదియా కీలకమైన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర కనిపించనున్నారు.
Go Back to Shorts
Varun Tej
Saiee Manjrekar
Ghani Movie

More Telugu News