Sensex: రెండు రోజుల లాభాలకు బ్రేక్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
వరుసగా రెండు రోజుల పాటు దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435 పాయింట్లు నష్టపోయి 60,176 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 17,957 కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.48%), ఐటీసీ (1.63%), నెస్లే ఇండియా (1.31%), టైటాన్ (1.25%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.98%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.12%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.81%), రిలయన్స్ (-1.41%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News