'సలార్'లో మలయాళ నటుడి కోసం పట్టుబట్టిన ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సలార్'లో మలయాళ నటుడి కోసం పట్టుబట్టిన ప్రభాస్!

Prabhas confidant on Prithviraj role in Salaar
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ 
  • కీలకపాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్
  • కరోనా సంక్షోభంతో నిలిచిన షూటింగ్
  • మరో సినిమా ఒప్పుకున్న పృథ్వీరాజ్
  • సలార్ చేయలేనని నిస్సహాయత
  • పృథ్వీరాజ్ ను ఒప్పించిన ప్రభాస్
టాలీవుడ్ అగ్రకథానాయకుడు ప్రభాస్ తన చిత్రాల వేగం పెంచారు. ఆయన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయిక. కాగా, సలార్ లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను చిత్రబృందం ఖాయం చేసుకుంది. పృథ్వీరాజ్ కూడా దర్శకుడితో తనకున్న అనుబంధంతో ఓకే చెప్పేశాడు. 

కానీ కరోనా సంక్షోభం రావడంతో సలార్ చిత్రీకరణ నిలిచిపోయింది. అదే సమయంలో పృథ్వీరాజ్ మరో ప్రాజెక్టు ఒప్పుకున్నాడు. ఇప్పుడు సలార్ కోసం డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో సినిమా వదులుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అయితే, సలార్ సినిమాలోని ఆ కీలకపాత్రకు పృథ్వీరాజే సరైనవాడని ప్రభాస్ సహా చిత్రబృందం బలంగా నమ్ముతోంది. 

ఈ నేపథ్యంలో, ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి వెళ్లి పృథ్వీరాజ్ తో మాట్లాడాడు. అతడు మళ్లీ సలార్ లో నటించేలా ఒప్పించాడు. పృథ్వీరాజ్ కొత్త ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆగుతామని అతడికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తన కొత్త చిత్రం పూర్తయ్యాక వెంటనే సలార్ చిత్రీకరణలో పాల్గొంటానని వెల్లడించాడు.
Prabhas
Prithviraj Sukumaran
Salaar
Prashant Neel

More Telugu News