Andhra Pradesh: 2, 3 తేదీల్లో అందుబాటులో ఉండండి.. శాఖాధిప‌తులు, క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఎస్ ఆదేశం

ap cs ordersto department heads and collectors
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త జిల్లాల‌ను ప్రారంభించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ క్ర‌మంలో గురువారం నాడు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌.. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధిప‌తులు, జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఓ కీల‌క సందేశం పంపారు.

ఏప్రిల్ 2, 3 తేదీల్లో అన్ని శాఖాధిప‌తులు, క‌లెక్ట‌ర్లు అందుబాటులో ఉండాల‌ని ఆ సందేశంలో సీఎస్ పేర్కొన్నారు. శాఖాధిప‌తులు అమ‌రావ‌తిలో, జిల్లాల క‌లెక్ట‌ర్లు జిల్లాల కేంద్రాల్లో అందుబాటులో ఉండాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 4న ప్రారంభం కానున్న కొత్త జిల్లాల ప్రారంభం నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌రాద‌న్న భావ‌న‌తోనే సీఎస్ ఈ ఆదేశాలు జారీ చేశార‌ని అధికారిక యంత్రాంగం భావిస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
New Districts
AP CS
Sameer Sharma

More Telugu News