ప్రభాస్ సర్జరీ తరువాతనే 'సలార్'
- ప్రభాస్ తాజా చిత్రంగా 'సలార్'
- ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్
- కోల్ మాఫియా నేపథ్యంలో సాగే కథ
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ఇక 'రాధే శ్యామ్' హడావిడి తగ్గింది కనుక, 'సలార్' తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సర్జరీ విషయం తెరపైకి వచ్చింది. విదేశాల్లో ప్రభాస్ సర్జరీ జరగనుందని అంటున్నారు. ఈ సర్జరీ తరువాత ప్రభాస్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారట. ఆ తరువాతనే తిరిగి ఆయన 'సలార్' షూటింగులో పాల్గొంటాడని చెబుతున్నారు.
ఈ కారణంగానే ప్రస్తుతానికి 'సలార్' షూటింగును ఆపేయడం జరిగిందని అంటున్నారు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్టు K' కూడా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.