Balka Suman: రేవంత్‌రెడ్డికి ఏమైనా జరిగితే మా బాధ్య‌త కాదు: బాల్క సుమ‌న్

balka suman comments on tpcc chief revanth reddy
షార్ట్స్‌లో చూడండి
టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ యువ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా జ‌రిగితే మా బాధ్య‌త కాదంటూ సుమన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

తెలంగాణ‌లో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇందులోకి తాజాగా మంగ‌ళ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య మంగ‌ళ‌వారం మొత్తం ట్వీట్ల వార్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన బాల్క సుమ‌న్ కాంగ్రెస్ పార్టీ తీరుపై.. ప్ర‌త్యేకించి రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుప‌డ్డారు. ఓట్ల కోసం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న సుమన్.. చిప్పకూడు తినేందుకు రెడీగా ఉండాలంటూ హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న రేవంత్ రెడ్డికి ఏమైనా జ‌రిగితే మా బాధ్య‌త కాదంటూ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు సూచించారు.
Go Back to Shorts
Balka Suman
TRS
Revanth Reddy
Congress

More Telugu News